తెలంగాణ

కెసిఆర్ ఉపవాసదీక్ష దొంగదీక్షే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27: తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ చేపట్టిన ఉపవాసదీక్ష ముమ్మటికీ దొంగ దీక్షనేనని, అలాంటి ఆధారాలన్నీ వీడియోతో సహా తన వద్ద సిద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ పార్టీపై తిట్ల పురాణంతో రాజకీయాలు చేయాలనుకుంటే తాను నిజంగా నీ బండారాన్ని బయటపెడితే కోలుకోలేవని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన ఆవేదన సభకు జైపాల్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే డికె అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కెసిఆర్ చేపట్టిన ఉపవాసం దొంగ ఉపవాసదీక్ష అని ఆరోపించారు. తాను చెప్పే మాటలు అబద్ధం కాదని, ముమ్మటికీ నిజంగానే చెబుతున్నానని, తన దగ్గర అప్పటికి వీడియోలన్ని ఉన్నాయన్నారు. ఖమ్మం ఆసుపత్రిలో చేరినప్పటి నుండి ప్రతి నిమిషం అక్కడి అప్పటి కలెక్టర్‌తో తాను కేంద్రమంత్రిగా ప్రతి నిమిషం కెసిఆర్ దీక్ష విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నానన్నారు. అయితే ప్రతిరోజు కెసిఆర్ ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేశారో కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. కెసిఆర్‌కు ఇచ్చినటువంటి అన్ని వసతుల ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. మనిషికి కావల్సిన న్యూట్రిషియన్ 750 క్యాలరీస్‌కు సంబంధించిన ఇంజెక్షన్లు కూడా కెసిఆర్ తీసుకున్నారని, వీటన్నింటికీ ఆయన ఆమోదంతోనే డాక్టర్లు సైతం వైద్యసేవలు అందించారన్నారు. అక్కడి నుండి కెసిఆర్‌ను నిమ్స్‌కు తరలించాక తాను నిమ్స్ డైరెక్టర్‌తో కూడా మాట్లాడనని, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తే డాక్టర్లు సమాధానం విచిత్రంగా చెప్పారన్నారు. మనిషికి కావల్సిన ఇంజెక్షన్లను కెసిఆర్ తీసుకుంటున్నారని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. అయితే వాటి ఆధారాలు కావాలని నిమ్స్ డైరెక్టర్‌ను కోరితే ఆధారాలు పంపించారని జైపాల్‌రెడ్డి వెల్లడించారు. ఆయనకు ఇంజెక్షన్లు ఇచ్చే వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. అప్పట్లో ఈ విషయాలను తాను బయటకు చెబితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే విఘాతం కలుగుతుందని నోరు విప్పలేదని ఆయన అన్నారు. తన దగ్గరికి తెలంగాణ కావాలంటూ కెసిఆర్ ఎన్నిసార్లు వచ్చారో ఆయనకు బాగా తెలుసని, ప్రస్తుతం ఆయనకు బాగా ఆహంకారం పెరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని, నాయకులను తిట్ల పురాణంతో రాజకీయాలకు విలువలు లేకుండా చేస్తున్నారని, రాజకీయాల్లో సంస్కారం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కెసిఆర్ ఒక్కరేనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను 45 ఏళ్ల పాటు ఎమ్మెల్యే, ఎంపిగా కొనసాగానని ఏనాడు కూడా అపశబ్ధం పలకలేదని, ఎక్కడైనా రాజకీయ నాయకులను ఆయా పార్టీలను విమర్శిస్తే తిట్ల పురాణంతో విమర్శించలేదని, అంశంపైనే మాట్లాడమే తప్పా. కెసిఆర్ మాదిరిగా నీచమైన రాజకీయాలకు ఎప్పుడూ దిగలేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకే కోవకు చెందినవారని, వీరంతా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా రాజకీయాలకు తెర లేపుతున్నారని విమర్శించారు. కెసిఆర్‌ను గద్దె దింపడానికి ప్రజలు సిద్ధమయ్యారని, ప్రధాని నరేంద్రమోదీ పేరు ఎత్తితేనే ప్రజలు ఛీకొడుతున్నారని, ఇది వారి దురదృష్టమని ఆయన ఎద్దేవా చేశారు. బాధ్యత, సభ్యత, సఖ్యత గల నాయకులు పాలకులుగా ఉంటేనే రాజకీయాల్లో విలువలు ఉంటాయని, ఈ మూడు అంశాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ ఎంపి మల్లురవి, డిసిసి అధ్యక్షుడు కొత్వాల్ పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో జరిగిన జన ఆవేదన సభలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి