తెలంగాణ

ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 27 : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 33 నెలలు దాటినా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీలక్ష్మీనర్సింహా ఫంక్షన్ హాల్‌లో జరిగిన కాంగ్రెసు జన ఆవేదన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ విదేశాలలో ఉన్న నల్లధనం తరలించి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు యువతకు ఇస్తానని ప్రజలను మోసం చేశారని అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులకు 3 ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లు, రైతుల రుణాల మాఫీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజి నుండి పిజి వరకు విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ప్రజలలో నిశ్శబ్దం విప్లవం దాగి ఉందని, తాము చేయించిన సర్వేల ప్రకారం 2019లో రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ప్రధాని మోదీ వ్యవసాయ ఉత్పత్తులు రైతుకు 1 గంటకు ఎంత వ్యయం అవుతుందో దానికి 50 శాతం అదనంగా ఇస్తామని రైతులకు హామీ ఇచ్చి తుంగలో తొక్కారని, వ్యవసాయ రంగం లెవీ నిలిపివేయడంతో సంక్షోభంలో పడిందని అన్నారు. రెండు ప్రభుత్వాల నిర్వాకాలు, ప్రజాధనం దుర్వినియోగం గురించి ప్రజలలోకి కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలపై వేధింపులు, అరెస్టులు, అణచివేతలకు పాల్పడితే 2019లో తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ జన ఆవేదన సమ్మేళనంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, మండల కాంగ్రెసు అధ్యక్షురాలు జి నిర్మల, హపీజానిజాం, పెండెం శ్రీనివాస్, నీలామంజు, యరగా ని నాగన్న, నిజాం, బి రామారావు, కొణతం వెంకటరెడ్డి, మైలా నాగిరెడ్డి, అరుణ్‌కుమార్, తన్నీరు మల్లిఖార్జునరావు, అమర్‌నాధ్‌రెడ్డి, జిల్లా, మండల, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.