తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడు తున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 6.2 కోట్లతో నిర్మించనున్న పెద్దచెర్వు ట్యాంక్‌బండ్, రైతుబజార్ విస్తరణ, నూతనంగా నియమించిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం లో భాగంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయానికి సాగునీరందించేందుకు కార్యాచరణ చేపడుతుందన్నారు. తమ 9 ఏళ్లపాలనలో పాజెక్టుల పేరుతో అవినీతికి తలుపులు తెరిచిన కాంగ్రెస్ నాయకులు చనిపోయిన రైతుల పేరుతో కోర్టులలో కేసులువేసి ప్రాజెక్టులను అడ్డుకోవడం హేయమైన చర్య గా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతన్న ఆకలి కేకలు, ఆత్మహత్యలను నివారించేందుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతోపాటు మద్దతు ధర కల్పిస్తోందన్నారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. బైక్ నడుపుతూ పట్టణ ప్రజలకు మంత్రి హరీశ్‌రావు అభివాదం చేయడం అం దరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్, భువనగిరి ఎంపి. బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.