తెలంగాణ

కుటుంబానికి 21 గొర్రెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28:రాష్ట్రంలో రెండు లక్షల యాదవ, కుర్మ కుటుంబాలకు త్వరలోనే కుటుంబానికి 21 గొర్రెలను పంపిణీ చేయనున్నారు. గొర్రెల పెంపకం దారుల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అందజేస్తారు.
రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరికి ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో 75శాతం సబ్సిడీపై 84లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సచివాలయంలో మంగళవారం రెండవసారి సమావేశం అయింది. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు సమావేశం అయ్యారు. నాలుగు లక్షల కుటుంబాల్లో తొలి విడత రెండులక్షల కుటుంబాలకు కుటుంబానికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేస్తారు. మిగిలిన రెండు లక్షల మందికి మరుసటి సంవత్సరం ఇదేవిధంగా ఇస్తారు. 75శాతం సబ్సిడీపై వీటిని అందజేస్తారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ప్రాంతంలోనే గొర్రెలకు ఇన్సూరెన్స్ ట్యాగ్ వేస్తారు. రీ సైక్లింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కిలోల లెక్కన గొర్రెలకు ధర నిర్ణయించాలని మంత్రి వర్గ ఉప సంఘం సూచించింది. రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలుస్తారు. టెండర్లు దక్కించుకున్న వారు వారి వారి గ్రామాలకు గొర్రెలను సరఫరా చేయాల్సి ఉంటుంది.