తెలంగాణ

సాదా బైనామాలతో చట్టబద్ధమైన హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 28: సాదాబైనామాలపై కొనుగోలు చేసిన రైతులకు భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకే తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రైతులు భూమి కొనుగోలు చేసినా, కబ్జాలో ఉన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల భూవిక్రేతల వారసులు రిజిస్ట్రేషన్ చేయకుండా బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతన్నారన్నారు. ఫలితంగా భూసమస్యలు ఉత్పన్నమై శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయన్నారు. వీటి నుంచి రైతులకు విముక్తి కలిగించి భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు సిఎం కెసిఆర్ సాదాబైనామాల ద్వారా పట్టాలు , టైటిల్‌డీడ్స్, 13బి పట్టాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఈ పథకాన్ని తొలిసారి అమలు చేస్తున్నారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్‌గార్డెన్‌లో సాదాబైనామా లబ్ధిదారులకు పట్టాలు, 59జిఓ రిజిస్ట్రేషన్ పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాబైనామాల పై చట్టబద్ధత కోసం రాష్టవ్య్రాప్తంగా 11లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో సిద్దిపేటలో 50వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లాలోని హెచ్‌ఎండిఏ పరిధిలోని వర్గల్, ములుగు మండలాలకు మినహాయింపు ఇచ్చారన్నారు. హెచ్‌ఎండిఓ పరిధిలో సైతం సాదాబైనామాతో కొనుగోలు చేసిన వారు నష్టపోతున్నారని సిఎం దృష్టికి తీసుకపోగా వారికి సైతం అవకాశం కల్పించేందుకు అంగీకరించారన్నారు. సాదాబైనామాల పై రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారించాకే వారికి పట్టా, టైటిల్‌డీడ్స్, ఆర్‌ఓఆర్, పహానీలు అందిస్తున్నారన్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా భూమి పై కలిగే హక్కులు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.
59జిఓ పట్టాబుక్కులు,
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
రాష్ట్రంలోని పేద యువతుల వివాహానికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి కింద 51వేలు యువతి తల్లిపేరుతో అందిస్తుందన్నారు. ఈ యేడు నియోజకవర్గంలో 450మందికి 2.30కోట్లు అందిస్తుందన్నారు. గర్భిణుల కోసం ప్రభుత్వ దవాఖానలో ప్రసూతైతే 12వేలు, కెసిఆర్ కిట్ అందిస్తారన్నారు. 59జిఓ కింద నియోజకవర్గంలో 1416మందికి పట్టా బుక్కులు అందించామని, మిగిలిన వారికి త్వరలోనే అందిస్తారన్నారు. సిఎంఆర్‌ఎఫ్ కింద పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సిద్దిపేట మొదటిస్థానంలో ఉందని, ఇప్పటి వరకు 1451 మందికి 9.18కోట్లు అందించామన్నారు. మిషన్ భగీరథ కింద తాగునీరు అందిస్తున్నామని, ఏప్రిల్ 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పట్టణాన్ని క్లీన్, గ్రీన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. సిద్దిపేట రాష్ట్రంలోనే ముందుందని, అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఇబ్రహీంపూర్ దేశానికే ఆదర్శంగా ఉందని, గ్రామ స్ఫూర్తిగా మిగతా గ్రామాలు మారాలని సూచించారు. స్మృతివనం పేరుతో మొక్కలు నాటి పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.