తెలంగాణ

యువతే మన సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: యువతే మన దేశానికి ఎనలేని సంపద అని, మరే దేశానికీ లేనంత భారీ సంఖ్యలో యువతీ యువకులు మన దేశంలో ఉన్నారని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో జెడ్ ఎఫ్ టెక్నాలజీ సంస్థను ఆయన గురువారం ప్రారంభించారు. ఇది దేశంలోనే ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ సేవలు అందించే తొలి సంస్థ కావడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా వయసు పెరుగుతోంది, భారత్‌లో మాత్రం 65శాతం మంది 35ఏళ్ల లోపువారేనని అన్నారు. దేశంలో 25కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉన్నారని, ప్రపంచంలో ఎక్కువమంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు ఉన్న దేశం మనదేనని అన్నారు. గణితంలో మనకున్న నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును ఇస్తోందని అన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని, జెడ్‌ఎఫ్ రాకతో హైదరాబాద్‌లో ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కొత్త పుంతలు తొక్కాలని కెటిఆర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో అభివృద్ధి కోసం టి -హబ్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం హార్డ్‌వేర్ కంపెనీలను ప్రోత్సహించేందుకు టి- వర్క్స్ అనే ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్టు కెటిఆర్ తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో జెడ్ ఎఫ్ టెక్నాలజీ సంస్థను ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్