తెలంగాణ

ఎంసెట్ నిర్వహణలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో నిర్వహించబోయే వివిధ ప్రవేశపరీక్షలు ప్రధానంగా ఎమ్సెట్‌కు సంబంధించి సాంకేతిక సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్ ఎంపిక పూర్తికాకపోవడంతో ప్రవేశపరీక్షల నిర్వహణలో గందరగోళం చెలరేగింది. టిఎస్ ఎమ్సెట్‌తో పాటు టిఎస్ ఇసెట్, టిఎస్ ఐసెట్ షెడ్యూళ్లలో కూడా స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చినా, పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవని మాత్రం అధికారులు చెబుతున్నారు.
ముందుగా ప్రకటించిన దాని ప్రకారం టిఎస్ ఇసెట్ మే 6న, ఎమ్సెట్ మే 12న, పిఇసెట్ మే 16న, ఐసెట్ మే 18న, లాసెట్ మే 27న, పిజిఇసెట్‌ను మే 30న నిర్వహించాల్సి ఉంది. తక్కువ పోటీ ఉన్న ఇసెట్, పిజి ఇసెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వాస్తవానికి ప్రతి ఏటా నవంబర్ చివరిలోనే ప్రవేశ పరీక్షల కసరత్తు మొదలవుతుంది. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూలును ప్రకటిస్తారు. ఈసారి అనేక సాంకేతిక కారణాలతో జనవరి వరకూ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జనవరిలో షెడ్యూలు ప్రకటించినా, కన్వీనర్ల ఖరారుకు సమయం పట్టింది. ఆ తరువాత పరీక్షల నిర్వహణకు అవసరమైన సాంకేతిక నిపుణుల సంస్థ ఎంపికలో పీట ముడి పడింది. సమయం లేదనే పేరుతో ఉన్నత విద్యామండలి ఒక సంస్థను ఎంపిక చేసే ప్రయత్నిస్తుండగా ప్రభుత్వం అడ్డుకుంది. టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై ఈ ప్రక్రియను పూర్తి చేయడం తగదని హెచ్చరించడంతో వ్యవహారం ఆగిపోయింది. దాంతో ఎమ్సెట్‌కు సంబంధించి ముందుగా అనుకున్నట్టు నోటిఫికేషన్‌ను జారీ చేయలేకపోయారు. అదే విధంగా ఎఫ్‌డిహెచ్, పిజి ఇసెట్‌లకు సంబంధించి కూడా అనిశ్చితి నెలకొందని తెలిసింది. ప్రతి ఏటా జరగాల్సిన పనులను కూడా సకాలంలో ఉన్నత విద్యామండలి చేయలేకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్వీసు ప్రొవైడర్ ఎంపిక వంటి ప్రక్రియను ముందే నిర్ణయించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీంలో వైద్య విద్య సంప్రదాయ కోర్సులపై కూడా ఆ శాఖ అధికారుల నుండి స్పష్టమైన వివరణ రాకపోవడం ఇబ్బంది కావటంతో 15శాతం కోటా సీట్లకు వెటర్నరీ కౌన్సిల్ సైతం జాతీయ స్థాయిలో ప్రవేశపరీక్ష నిర్వహించలేమని పేర్కొనడం మరో సమస్యగా మారింది. ఈ అనుమానాలను నివృత్తి చేసేలోగానే ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి తదితరులు ఇతర రాష్ట్రాల అధ్యయనానికి వెళ్లడంతో మరికొంత కొంత జాప్యం జరిగింది.