తెలంగాణ

టిజాక్‌లో అంతర్మథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటి (టిజాక్)లో అంతర్మధనం ప్రారంభమైంది. టిజాక్ కన్వీనర్ పిట్టల రవీందర్, కో-కన్వీనర్ తన్వీర్ సుల్తానా, టిజాక్ కో-చైర్మన్ ఎన్.ప్రహ్లాద్‌లు సంయుక్తంగా కోదరండరాంకు రాసిన లేఖపై టిజాక్ కేంద్ర కమిటీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కోదండరాం గురువారం కమిటీ సభ్యులందరితో చర్చించారు. టిజాక్ కార్యక్రమాల్లో మొదటి నుండి చురుకుగా పాల్గొంటూ వస్తున్న పిట్టల రవీందర్ ఉన్నపళంగా తనను వ్యతిరేకించడం పట్ల కోదండరాం ఆవేదనకు గురవుతున్నట్టు తెలిసింది. పిట్టల రవీందర్ తదితరుల సంతకంతో వచ్చిన లేఖపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. టిజాక్ నిర్వహించే ప్రతి సమావేశంలో కూడా రవీందర్ చేసిన కృషిని కోదండరాం శ్లాఘిస్తూనే ఉన్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వంపై వత్తిడి తేవడంలో టిజాక్ గట్టి నిర్ణయం తీసుకున్ననదని, దానికి కట్టుబడే భవిష్యత్తు ప్రణాళిక కూడా కొనసాగుతుందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
టిజాక్‌లో వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, చివరకు తనకు (కోదండరాం) కూడా వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇవ్వనక్కరలేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. టిజాక్‌ను రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఇప్పటికే పలు పర్యాయాలు తాను స్పష్టం చేశానని కోదండరాం అంతర్గత సమావేశంలో అభిప్రాయపడ్డట్టు తెలిసింది. మళ్లీ మళ్లీ కొన్ని పత్రికలు టిజాక్ రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతోందంటూ చేస్తున్న ప్రచారం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రవీందర్ రాసిన లేఖకు లిఖితపూర్వకంగా సమాధాం చెప్పాలా, లేక ఆయనను ఇతరులను ఆహ్వానించి చర్చలు జరపాలా అన్న అంశంపై సహచరులతో కోదండరాం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. టిజాక్‌ను అంతర్గత విభేదాల నుండి బయటపడవేసే అంశంపైనే కోదండరాం ప్రధానగా దృష్టి పెట్టినట్టు తెలిసింది.