తెలంగాణ

డెడ్ స్టోరేజీలో కృష్ణా బేసిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లో జలకళ అడుగంటింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో వర్షాకాలం వచ్చేంతవరకు ఉన్న నీటిని మంచినీటి అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలూ పోటాపోటీగా ప్రణాళికలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో కలిపి 174 టిఎంసిల నీరు ఉంది. మార్చి నెలలోనే ఎండలు ముదరడంతో నీటి ఆవిరి పెరగడంతో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 215.81 టిఎంసిలు కాగా, ప్రస్తుతం కేవలం 43.48 టిఎంసిల నీరే ఉంది. ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 834.2 అడుగులకు పడిపోయింది. శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు కరెంటు ఉత్పత్తి చేసి రోజూ 12,713 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 312.05టిఎంసిలు, కానీ ఈ ప్రాజెక్టులో నీటినిల్వ 134.06టిఎంసిలకు పడిపోయింది. ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 511.4 అడుగులు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టిఎంసిలకు గానూ కేవలం 0.66 టిఎంసిలు ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 30 మున్సిపాలిటీలు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌పై ఆధారపడి రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి.
రెండు రోజుల క్రితం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల ఇంజనీర్ల మధ్య నీటి విడుదలపై వాగ్వాదం జరిగిన విషయం విదితమే. ఈ విషయమై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ నుంచి 18.5 టిఎంసిల నీటిని బోర్డు కేటాయిస్తే అంతకంటే ఎక్కువగా 1.5 టిఎంసిల నీటిని ఆంధ్ర వాడుకుని ఇంకా నీటిని విడుదల చేయాలంటూ తమ ఇంజనీర్లతో తగాదా పడిందని, ఈ విషయం బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా తమకు కేటాయించిన నీటిలో చాలా మటుకు ఆవిరి అయిందని, మొత్తం 18.5 టిఎంసిలు తమకు అందలేదని ఆంధ్ర ఇంజనీర్లు వాదిస్తున్నారు. ఎండాకాలంతో పాటు అన్ని కాలాల్లో నీటి విడుదల చేసినప్పుడు, నిల్వ దశలో ఆవిరి ఉంటుందని, సాధారణమైన అంశమని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు.