తెలంగాణ

2019లో మాదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 2: వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, ప్రజల కష్టాలు తీర్చే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఏఐసిసి పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడుతూ అవగాహన, అనుభవం లేని అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతున్నదని, ప్రశ్నించిన వారిని అణగతొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం మినహా మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకుండా దాటవేస్తుందన్నారు. రెండున్నరేళ్ళలో ప్రపంచంలోని సగం దేశాలు తిరిగిన ఘనత మన ప్రధానిదేనన్నారు. నోట్లరద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన నరేంద్రమోడీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అవే హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న టిఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేసుకోవాలన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే పేర్లుమార్చి ఈ ప్రభుత్వాలు చేపడుతున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్థి, ఖమ్మం జిల్లాలో తాము చేసిన కార్యక్రమాలను ఆమె వివరించారు. సభలో రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. ఆ వివాదం ఫ్లెక్సీలు చింపుకునే వరకు వెళ్ళింది. సభలో మాట్లాడనని చెప్పిన పొంగులేటిని కేంద్ర, రాష్ట్ర నేతలు సముదాయించి మాట్లాడేలా చేశారు.