తెలంగాణ

ఆర్టీసిలో మహిళా డ్రైవర్లకు అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సంస్థాన్ నారాయణ్‌పూర్, మార్చి 3:రానున్న రోజుల్లో ఆర్టీసీలో అర్హతలను బట్టి మహిళా డ్రైవర్లకు అవకాశం కల్పించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఢిల్లీ ఆర్టీసిలో డ్రైవర్‌గా పని చేస్తున్న సరిత మంత్రిని కలిసి తనకు టిఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సరిత అర్హతలు పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించారు. ఆర్టీసీలో మహిళలకు చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. గతంలో జరిగిన నియామకాల్లో మహిళలు కండక్టర్లుగా ముందుకు వచ్చినా డ్రైవర్లుగా రాలేదని చెప్పారు. అయితే సరిత లాంటి వారు ముందుకు వస్తే నియామకాల్లో మహిళా కోటా ఆధారంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలానికి చెందిన సరిత ఢిల్లీ ఆర్టీసీలో గత మూడేళ్ల నుంచి కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తోందని, రాబోయే కాలంలో నియామకాల్లో ఆమెకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పలు రివార్డులు, రికార్డులున్న సరిత లాంటి మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సరిత కోరుకుంటే షీ క్యాబ్ కూడా ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లాసంస్థాన్ నారాయణ్ పూర్‌మండలం మామిల్లపల్లి పంచాయతీ పరిధిలోని రోళ్లబండ తండాకు చెందిన గిరిజన మహిళ వాంకుడోతు సరిత ఢిల్లీలోని ఆజాద్ హింద్ ఫౌండేషన్ కింద క్యాబ్ డ్రైవర్‌గా పని చేశారు.
దేశంలోనే తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా ఉమెన్ అచీవర్ అవార్డు పొందారు. కాగా, తనకన్నా పెద్ద వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడంతో వృద్ధులైన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండడం కోసం తెలంగాణా ఆర్టీసీలో పని చేయాలని అనుకుంటున్నట్లు సరిత తెలిపారు.

చిత్రం..రవాణామంత్రి మహేందర్ రెడ్డికి
వినతిపత్రం అందజేస్తున్న వాంకుడోతు సరిత