తెలంగాణ

చిట్టిబాబు దంపతులకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 4 : ఆత్మహత్యకు పాల్పడిన ఎస్‌ఐ చిట్టిబాబు, అతని భార్య భౌతికకాయాలకు శనివారం తిరుమలగిరి (సికిందరాబాద్)లోని లోతుకుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పోలీస్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి తదిరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపినాథ్ మాట్లాడుతూ ఎస్‌ఐ చిట్టిబాబు దంపతుల ఆత్మహత్య దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ కేసులో ఎంతటివారున్నా ఉపేక్షించొద్దని ఆయన అధికారులను కోరా రు. ఈ సంఘటనతో పోలీసులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఆయన సూచించారు. అంతకు ముందు ఎస్‌ఐ చిట్టిబాబు, భార్య సరోజ మృతదేహాలకు సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తన తల్లిదండ్రుల మృతికి కారణం పోలీస్ ఉన్నతాధికారులేనని పోలీసులకు ఎస్‌ఐ చిట్టిబాబు కుమారుడు ప్రేమ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. దళిత సంఘాలు సైతం ఉన్నతాధికారులైన సిపి, ఎసిపిలు శివకుమార్, నర్సింహారెడ్డిలు వేధింపులే కారణమని ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆత్మహత్యలో కొత్త కోణం..
దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు దంతపుల ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ చిట్టిబాబు, ఆయన భార్య సరోజ, భర్త ప్రేమ్‌కుమార్‌పై చిట్టిబాబు కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టింది. 11 అగస్టు, 2015లో మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 498ఐ. 3.4 డిపిల కింద కేసు నమోదు కాగా, కేసు ఇంకా విచారణలోనే కొనసాగుతోంది. ఈనెల 2న కేసు రాజీ కుదుర్చుకోవాల్సి ఉండగా, ఎస్‌ఐ రాలేదని ఆయన కోడలు ఆరోపించింది. ఆ మరునాడే ఈ దురాఘతానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది.
ఎస్‌ఐ చిట్టిబాబు ఆత్మహత్య?
భార్యను రివాల్వర్‌తో కాల్చిచంపి, తాను ఆత్మహత్యకు పాల్పడిన ఎస్‌ఐ చిట్టిబాబుది ఆత్మహత్యగానే భావిస్తున్నామని మృతదేహాలకు పోస్టుమార్టం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన రాంచందర్ తెలిపారు.
ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విలేకర్లతో మాట్లాడారు. చిట్టిబాబు భార్య మృతదేహం నుంచి బుల్లెట్ స్వాధీనం చేసుకున్నామని, చిట్టిబాబు కాల్చుకున్న బుల్లెట్ గదిలోనే లభించిందన్నారు. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అన్న దాని పై పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామని, వారి నివేదిక తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని డాక్టర్ స్పష్టం చేశారు.
సంతాపకంగా దుబ్బాక బంద్
దుబ్బాక: పోలీసు ఉన్నతాధికారుల వేధింపులకే ఎస్‌ఐ చిట్టిబాబు దంపతులు బలైనారని ఆరోపిస్తు దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం దుబ్బాకలో బంద్ చేపట్టారు. శనివారం ఉద యం దళిత సంఘాల, బిజెపి, బిఎస్పీ, సిపిఐ, సిపిఎం నేతలు పట్టణంలో తిరుగుతూ బంద్ చేయించారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు బంద్ చేయించారు. ఎస్‌ఐ అమర్‌హే అంటు విద్యార్థులు, నేతలు ర్యాలీ, బైక్ ర్యాలీ తీశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారం చేపట్టి ఎస్‌ఐ చిట్టిబాబు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అన్ని కోణాల నుండి దర్యాప్తుమెదక్ ఎఎస్పీ రాంచంద్రారెడ్డి
302, 174 సెక్షన్‌లపై కేసు నమోదు
భార్యను రివాల్వర్‌తో కాల్చి, తాను కాల్చుకున్న ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ ఎఎస్పీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం సిద్దిపేట ఏరియా ఆసుపత్రి వద్ద విలేఖరులతో మాట్లాడుతూ ఎస్‌ఐ చిట్టిబాబు ఆత్మహత్యకు ప్రేరిపితమై కారణాలను అనే్వషిస్తున్నట్లు తెలిపారు. నిస్పక్ష పాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

చిత్రం..ఎస్‌ఐ చిట్టిబాబు మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న పోలీసు అధికారులు