తెలంగాణ

మహిళల జోలికొస్తే జైలుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: మహిళలపై వేధింపులను అరికట్టేందుకే షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని, ఎవరైనా మహిళల జోలికి వస్తే జైలుపాలు కాక తప్పదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పీపుల్స్ ప్లాజాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్, చైల్డ్ ఎక్స్‌పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రతలో షీ టీమ్స్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, మహిళా, శిశు భద్రతపై షీటీమ్స్ ఏర్పాటు చేసిన ఎక్స్‌పోను ఆయన ప్రశంసించారు. మహిళలకు భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించామని మంత్రి నాయిని తెలిపారు. లైంగిక వేధింపుల అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, మహిళాభద్రతకు తెలంగాణ పోలీస్ విభాగం కట్టుబడి ఉందన్నారు. పోలీస్ శాఖలో పలు సంస్కరణలు చేపట్టి నేరరహిత హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నేర రహిత సమాజానికి పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని, తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. షీ టీమ్స్ చీఫ్ స్వాతిలక్రా మాట్లాడుతూ, షీ టీమ్స్ మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ప్రశంసనీయమన్నారు.
నేడు 5కె, 2కె రన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా వద్ద 5కె, 2కె రన్ జరుగుతుందని స్వాతిలక్రా తెలిపారు. దాదాపు పదివేల మంది మహిళలు ఈ రన్‌లో పాల్గొంటారని ఆమె తెలిపారు.

చిత్రం..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పీపుల్స్ ప్లాజాలో షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఉమెన్, చైల్డ్ ఎక్స్‌పోను ప్రారంభించి ప్రసంగిస్తున్న హోంమంత్రి నాయిని