తెలంగాణ

అధికార దర్పం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మార్చి 4: ఉన్నతాధికారుల దర్పం ఒక్కోసారి చిరుద్యోగులకు చిన్నచూపుగా మారుతుంది. నల్లగొండ పట్టణ పరిధిని చారిత్రక పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాలు, పానగల్ టూరిజం మ్యూజియం పరిశీలనకు శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్డీవో వెంకటాచారి, టూరిజం జిల్లా అధికారి శివాజీ ఆలయాలను, మ్యూజియంల విశేషాలను, వాటి అభివృద్ధికి కావాల్సిన చర్యలను వివరించారు. వెంకటేశం ముందుగా పచ్చల సోమేశ్వర ఆలయంలోకి వెళ్లిన సందర్భంగా తన బూట్లను విప్పి లోనికి వెళ్లారు. అనంతరం ఆలయం నుండి పక్కనే ఉన్న టూరిజం మ్యూజియంలోకి వెళ్లారు. మ్యూజియం ప్రాంగణంలోని శిల్పాలను, విశ్రాంతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా తన బూట్లను వెతుక్కుంటుండగా స్థానిక పానగల్ విఆర్‌ఏ వీరయ్య బూట్లు తీసుకవచ్చి వెంకటేశంకు అందించారు. ఈ దృశ్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోయినా మీడియా ప్రతినిధుల కెమెరాలకు మాత్రం చిక్కింది. పెద్దసార్‌కు చిరుద్యోగి బూట్ల సేవ సందర్భానుసారం యాదృచ్ఛికంగానే జరిగినా గతంలోని ఆర్డర్లీ వ్యవస్థను తలపించిందంటు చూసిన వారు చర్చించుకోవడం కనిపించింది.

చిత్రం.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి
బుర్రా వెంకటేశంకు బూట్లు అందిస్తున్న విఆర్‌ఏ వీరయ్య