తెలంగాణ

నరుూం అక్రమాస్తుల కేసులో నేతి హస్తంపై సిట్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుపై అభియోగాలు గుప్పుమంటున్నాయి. నరుూంతో సంబంధాలున్నట్టు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్‌రావును విచారించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల సేపు అతణ్ని విచారించి నరుూంతో సంబంధాలపై ఆరా తీసినట్లు తెలిసింది. నిరుడు ఆగస్టు 8న నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దాదాపు 756 సాక్ష్యులను విచారించి 325 మందికి నోటీసులు పంపారు. 176కేసులు నమోదు చేసి 145 మందిని అదుపులోకి తీసుకున్నారు. 12మందిపై పీడీ యాక్టు కేసు పెట్టారు. కాగా కొందరు పోలీస్ బాస్‌లపై బదిలీ వేటు పడగా, అధికార పార్టీ రాజకీయ నేత విద్యాసాగర్‌రావును సిట్ అధికారులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. భువనగిరికి చెందిన నాగేందర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో విద్యాసాగరరావును విచారించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
నరుూంతో ఎలాంటి సంబంధాలు లేవు: విద్యాసాగర్‌రావు
కాగా, నరుూంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తనపై దుష్ప్రచారానికి ఒటిగట్టారన్నారు. నరుూం కేసు సిట్ దర్యాప్తు జరుపుతున్నందున విచారణకు సహకరించానన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన అన్నారు. తన కుటుంబానికి నరుూమ్ అక్రమాస్తులతో ప్రమేయం ఉందన్న ప్రచారం సత్యదూరమన్నారు.