తెలంగాణ

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేర రహిత హైదరాబాద్ కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం 5కె, 2కె రన్ జరిగింది.
నగరంలోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ 5కె, 2కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. షీ టీమ్స్ అధికారిణి స్వాతిలక్రా, నార్త్‌జోన్ డిసిపి బి సుమతి, సినీ నటీమణులు అక్కినేని అమల, తాప్సి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, మహిళల భద్రతకు షీ టీమ్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, మహిళల చైతన్యం కోసం చేపడుతోన్న అనేక కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరగాలని, ఆత్మరక్షణతో మహిళ సాధికారత సాధ్యపడుతుందన్నారు. షీ టీమ్స్ అధికారిణి, అదనపు కమిషనర్ స్వాతిలక్రా మాట్లాడుతూ పోలీస్ శాఖ మహిళల భద్రతకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. భరోసా మంచి ఫలితాలనిస్తుందని తెలిపారు.
షీ టీమ్స్ పనితీరు బాగుంది: అమల
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరు బాగుందని, షీ టీమ్స్ చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయని సినీ నటి అక్కినేని అమల అన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో జరిగిన 5కె రన్‌లో ఆమె పాల్గొన్నారు. మహిళల్లో చైతన్యం, భద్రతపై అవగాహన కోసం రన్ నిర్వహించడం హర్షణీయమన్నారు.
ఆనందంగా ఉంది: తాప్సీ
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 5కె, 2కె రన్ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ను అభినందిస్తున్నానని, ఈ రన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని తాప్సీ అన్నారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్ జరుపుతోన్న కృషి ప్రశంసనీయమనీ, అలాగే షీ టీమ్స్ అవగాహన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.