తెలంగాణ

సిజిఎఫ్ నుండి రూ.65 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ సర్వశ్రేయోనిధి (సిజిఎఫ్) నుండి 2017-18 సంవత్సరానికి వివిధ పనులకోసం 65 కోట్ల రూపాయలు కేటాయించాలని సిజిఎఫ్ కమిటీ నిర్ణయించింది. ఎండోమెంట్స్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సిజిఎఫ్ కమిటీ సోమవారం ఇక్కడి దేవాదాయ శాఖ కార్యాలయం (్ధర్మిక భవన్) లో సమావేశమై వివిధ తీర్మానాలను చేసింది. కొత్త ఆలయాల నిర్మాణానికి 30 కోట్లు, ధూపదీప నైవేద్యం (డిడిఎన్) పథకానికి 15 కోట్లు, ఆగమ పాఠశాలల నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. బలహీన వర్గాల కాలనీలలో నిర్మించే 20 ఆలయాలకు ఒక్కో దానికి 10 లక్షల చొప్పున రెండుకోట్లు, ఇతర 30 పనులకోసం తొమ్మిది కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. వేములవాడలో వేద ఆగమ సాంస్కృతిక పాఠశాల నిర్వహణకు సిజిఎఫ్ నుండి నిధులు కేటాయించాలని నిర్ణయించారు. నూతనంగా నిర్మించే ఆలయాలకు సిజిఎఫ్ నుండి ఇచ్చే నిధులపై సీలింగ్ ఉండాలని కమిటీసభ్యులంతా అభిప్రాయపడ్డారు. ఒక్కో ఆలయానికి 50 లక్షలు మించి కేటాయించకూడదని నిర్ణయించారు. ఈ అంశంపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించారు.