తెలంగాణ

అధికార దుర్వినియోగం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: అధికారులు ఇష్టానుసారం తమ ప్రయోజనాల కోసం అధికారాలను దుర్వినియోగం చేయడం తగదని జస్టిస్ పి వి సంజయ్‌కుమార్, జస్టిస్ అనిస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నాడు వ్యాఖ్యానించింది. ఆయుష్ విభాగంలో లెక్చరర్‌గా మారిన తర్వాత తిరిగి డాక్టర్‌గా అధికారులు నియమించారని పేర్కొం టూ డాక్టర్ కోవి శ్రీహరి దాఖలు చేసి న పిటీషన్‌ను బెంచ్ విచారించింది. బోధనలో అనుభవం లేని వ్యక్తిని లెక్చరర్‌గా నియమించుకునేందుకు వీలుగా తనను తిరిగి వైద్యుడిగా నియమించారని పిటీషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాస్తవాలను గుర్తించిన న్యాయమూర్తులు ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.
వారితో సంబంధాలు లేవు
అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలతో అఖిల భారత అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏంజెంట్ల సంక్షేమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని సిఐడి సోమవారం హైకోర్టుకు తెలిపింది. 7వేల కోట్ల రూపాయిల అగ్రిగోల్డ్ స్కామ్‌పై సిబిఐ విచారణ జరిపించాలని సంక్షేమ సంఘం కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. దీనిపై గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేర కు సిఐడి సంక్షేమ సంఘానికి, యాజమాన్యానికి ఉన్న సంబంధాలపై నివేదిక ఇచ్చింది.
ట్రిబ్యునల్ ఆదేశాలపై
కేంద్రం పిటిషన్
ఐఎఎస్ అధికారుల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం వేర్వేరు పిటీషన్లను హైకోర్టులో దాఖలు చేసింది. సోమేష్‌కుమార్, రోనాల్డ్ రాస్, ఎస్ ఎస్ రావత్, కె అమ్రపాలి, కరుణ వాకా టి, ఎం ప్రశాంతి, ఎ వాణి ప్రసాద్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ట్రిబ్యునల్ కొట్టి పారేసింది. హరికిరణ్, శివశంకర్ లహోటి, గుమ్మల్ల సృజనలను కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన వారిగా గుర్తించాలని ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే ప్రత్యూష సిన్హా కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు తాము ఈ కేటాయింపులు చేశామని కేంద్రం వివరించింది.