తెలంగాణ

కమనీయం... లక్ష్మీనరసింహుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి తిరుకల్యాణోత్సవం, వైభవోత్సవ కల్యాణోత్సవాలు సోమవారం వైష్ణవ పంచరాత్ర ఆగమశాస్త్రానుసారం సంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు, జగత్‌ద్రక్షుడైన లక్ష్మీనరసంహుడికి క్షీరసముద్ర తనయ లక్ష్మీ అమ్మవారితో జరిగిన కల్యాణోత్సవ ఘట్టాన్ని వీక్షించి భక్తజనులు, గరుడుడి ఆహ్వానంతో యాదాద్రిపై వెంచేసిన ముక్కోటి దేవతలు పులకించారు. కల్యాణోత్సవంతో లక్ష్మీసమేతుడైన నరసింహుడు మహాదానందంతో గజవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు.
ప్రభుత్వం తరుపునా దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్ర కరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం శ్రీరామాలంకార సేవను అర్చక పండితులు శాస్త్రానుసారం ఘనంగా నిర్వహించి హనుమత్ వాహనంపై విహారింపజేశారు. అనంతరం బాలాలయంలో 11 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవ ఘట్టానికి స్వామివారు గజవాహనంపై ఆసీనులై మంగళవాయిధ్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య మండపానికి తరలిరాగా, అమ్మవారు ముత్యాలపల్లకిలో మండపానికి చేరారు. స్వామివారి కల్యాణోత్సవానికి దేవస్థానం తరుపున ఈవో గీత పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించారు. యాదగిరీశుడి కల్యాణానికి తిరుమలేశుడు పంపించిన పట్టువస్త్రాలను టిటిడి జెఈవో శ్రీనివాసరాజు, డాలర్ శేషాద్రిల అర్చక బృందం యాదాద్రి ఈవో గీత, కలెక్టర్ అనితారామచంద్రన్ సమక్షంలో యాదాద్రి అర్చక బృందానికి అందించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, యాదాద్రి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అనితారామచంద్రన్, గుగులోతు రవినాయక్, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి హాజరయ్యారు. రాత్రి 7-30కు కొండ కింద జిల్లా పరిషత్ పాఠశాలలో వైభవోత్సవ కల్యాణం వేలాది మంది భక్తుల సమక్షంలో శాస్తయ్రుక్తంగా నిర్వహించారు.
రకరకాల పూలతో, దేదీప్యమానకాంతులతో అలంకరించిన పెళ్లి మండపంలో కొలువుతీర్చిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞీకులు శ్రీనివాసాచార్యులు విష్వక్సేనారాధనతో ఆరంభించారు. పంచ పుణ్యనది జలా ల ఆవాహన, మండప సంప్రోక్షణ, రక్షబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవితధారణ, మధుపర్క నివేదన, నూతన పట్టువస్రాలంకారణ చేశారు. లక్ష్మీదేవి తండ్రియైన సముద్రుడు పాదప్రక్షాళన చేసి కన్యాదానం చేయగా, జీలకర్ర, బెల్లం ధారణ పిదప వేద మంత్రోచ్ఛరణల మధ్య, భక్తుల గోవిం ద నామస్మరణల మధ్య స్వామివారు అమ్మవారికి మంగళసూత్రధారణ చేసే ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఔన్నత్యాల తో కూడిన విశేషాలను, కల్యాణ ఘట్టాల ప్రాధాన్యతల ను యాజ్ఞికులు భక్తులకు వివరిస్తూ కల్యాణోత్సవాన్ని ఆద్యం తం రవవత్తరంగా రమణీయంగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు ముత్యాల తలంబ్రాల ధారణ చేసి బ్రహ్మముడులు వేసి మంగళనీరాజనలు, అందించాక గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను ఆలయానికి చేర్చారు. మంగళవారం స్వామివారికి గరుడ వాహన సేవ, రథోత్సవం నిర్వహిస్తారు.