తెలంగాణ

మహిళలకు మంత్రి పదవి ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ అవతరించి మూడేళ్లవుతున్నా మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వని సిఎం కెసిఆర్ మహిళల అభ్యున్నతి అంటూ ఇచ్చిన హామీలను ఎవరు నమ్ముతారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళల నాయకత్వం, వారి సామర్థ్యం పట్ల కెసిఆర్‌కు విశ్వాసం లేదన్నారు. రాష్ట్ర జనాభాలో మహిళలు 49శాతం ఉన్నా, మంత్రివర్గంలో వారికి చోటు ఇవ్వకపోవడాన్ని ప్రజలు క్షమించరన్నారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యేందుకు సోనియాగాంధీ కారణమన్నారు. సోనియా తెగువ వల్లనే తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ఒక మహిళ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల అవతరించిన తెలంగాణలో మహిళలకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గతంలో మంత్రివర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురికి అవకాశం కల్పించిందన్నారు. మండలిలో కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి మహిళలకు పదవులు ఇస్తామన్న కెసిఆర్ మాటలు హాస్యాస్పదమన్నారు. నిజంగా కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే 2014లోనే మహిళలకు అవకాశం ఇచ్చేవారన్నరు.