తెలంగాణ

ఏప్రిల్, మే నెలల్లో కొత్త రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆహార భద్రత కార్డులను జారీ చేయడానికి లబ్ధిదారుల డేటా గుర్తింపు ఎంపిక, డిజిటలైజేషన్ పూర్తి చేసి వంద శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేయడమైందని తెలంగాణ పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం బదులిస్తూ ఏప్రిల్ లేదా మే మాసంలో 89 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. పింక్ కలర్‌లో ఉండే ఈ కార్డు ఎలాంటి గుర్తింపు కోసం జారీ చేసింది కాదని కేవలం బియ్యం తదితర వస్తువులు సరఫరా చేయడానికేనని మంత్రి స్పష్టం చేశారు. నకిలీ రేషన్ కార్డులను రద్దు చేస్తామన్నారు. రేషన్ కార్డులు జారీ చేయనందుకు ప్రభుత్వంపై అదనంగా రూ.18 కోట్ల భారం పడుతుందన్న సభ్యుల వాదన సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పౌరసరఫరాల శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో రూ. 3వేల కోట్ల వ్యయంతో రేషన్‌కార్డు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం, రూ. ఏడు వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో ఒకరి మృతి
సికింద్రాబాద్, మార్చి 21: స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపక్రింద నీరులా విస్తరిస్తూ అమాయక ప్రజల ప్రాణాలను తోడేస్తూనే ఉంది. వ్యాధితో తాజాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పలగూడకు చెందిన సుమన్ (23) వారం రోజుల క్రితం మహవీర్ ఆసుపత్రిలో చేరి వ్యాధి నిర్థారణలో స్వైన్‌ఫ్లూ బయటపడడంతో ఈనెల 17న గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమన్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ (22) అదే విధంగా బోయిగూడకు చెందిన ఆరు నెలల గర్భిణీ వనిత(29) స్వైన్‌ఫ్లూ వ్యాధితో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని గతంలో వేసవిలో ఈ వ్యాధి ఎక్కడ కనిపించకపోయిన ఈ మధ్య వేసవిలో సైతం విస్తరిస్తూ ఉండడంతో ప్రజలను ఒకింత భయాందోళనలకు గురిచేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

అధిక ఫీజులకు చెక్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రంలో ఇంటర్నేషనల్, కార్పొరేట్, కానె్సప్ట్, టెక్ పేరిట చలామణి అవుతున్న ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు చేయడాన్ని నియంత్రిస్తూ త్వరలో ఒక విధానాన్ని ఖరారు చేస్తామని, దీనికి సంబంధించి 1994లో జారీ అయిన జీవో 1ను అమలు చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 12 ఇంటర్నేషనల్ స్కూళ్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ స్కూళ్ల యాజమాన్యం పంపిన వివరణలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, గతంలో ఫీజుల నియంత్రణకు సంబంధించి జారీ అయిన జీవో 91పై కొన్ని విద్యా సంస్థలు సుప్రీం కోర్టుకు వెళ్లగా, అది విచారణలో ఉందని, మరో జీవో 42ను హైకోర్టులో సవాలు చేశారని, అది కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.