తెలంగాణ

రుక్మాపూర్ లెదర్ పార్క్‌కు త్వరలోనే డిపిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7:కరీంనగర్ రూక్మాపూర్ లెదర్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేయిస్తామని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ తెలిపారు. రుక్మాపూర్ లెదర్ పార్క్‌ను కాంగ్రెస్ హయంలో రద్దు చేశారని, ఇప్పుడు వాళ్లే ఆందోళన చేస్తున్నారని ఎంపి తెలిపారు. ఇప్పుడు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే లెదర్‌పార్క్ రద్దు చేశారని చెప్పారు. లెదర్ పార్క్‌ను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్న లెదర్ పార్క్‌లను సందర్శించి వాటి పనితీరు పరిశీలిస్తామని వినోద్ తెలిపారు.