తెలంగాణ

విద్యుత్ ఉద్యోగుల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: ఈ నెల 9వ తేదీన గవర్నర్ సమక్షంలో జరగనున్న రెండు రాష్ట్రాల మంత్రుల సమావేశంలో తెలంగాణ విద్యుత్ సంస్ధలు రిలీవ్ చేసిన 1259 మంది విద్యుత్ ఉద్యోగుల వివాదం తేలనుంది. ఈ వివాదం 25 నెలలుగా కొనసాగుతోంది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్ధ ఎండిలు గవర్నర్ నరసింహన్‌కు నివేదికలను సమర్పించనున్నారు. తెలంగాణ రిలీవ్ చేసిన 1259 మంది విద్యుత్ ఉద్యోగుల్లో 710 మంది ఉద్యోగులు ఆంధ్ర స్ధానికత కలిగినట్లు తేలింది. రాష్టప్రతి ఉత్తర్వుల మేరకు తెలంగాణలో లేదా ఆంధ్రాలో వరుసగా ఏడు సంవత్సరాల పాటు విద్యను అభ్యసించిన వారు స్ధానికులవుతారు. ఈ ప్రాతిపదికన మొత్తం 1259 మంది ఉద్యోగుల్లో 710 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు తేలింది. తెలంగాణ అధికారులు మాత్రం ఉద్యోగి జన్మించిన ప్రాతిపదికన తీసుకుని స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని వాదిస్తున్నారు. తెలంగాణ స్ధానికత కోసం నకిలీ విద్యా పత్రాలను సృష్టించారని తెలంగాణ అధికారులంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు మాత్రం జన్మస్ధలం ప్రాతిపదికన తీసుకుంటే తప్ప తమకు అన్యాయం జరుగుతోందంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ ఈ నెల 9వ తేదీ గురువారం సమీక్షించనున్నారు. తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. విద్యార్హత, జన్మస్ధలం అంశంపై తలెత్తిన వివాదంపై పోలీసు విచారణ చేపట్టి పూర్తి వివరాలను వెంటనే తెప్పించుకునే ప్రతిపాదనను కూడా రెండు రాష్ట్రప్రభుత్వాలు గవర్నర్‌కు నివేదించనున్నట్లు సమాచారం. కగాగా విద్యుత్ సౌద ప్రాంగణంలో తమకు న్యాయం చేకూర్చాలని కోరుతూ రెండు వారాలుగా రిలీవ్ అయిన ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు.
గవర్నర్ వద్ద హైదరాబాద్‌లోని 17 ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తులు, ఉద్యోగాల పంపకంపై కూడా చర్చలు జరగనున్నాయి. ఏపిఎస్‌ఆర్టీసి, ఆగ్రోస్, ఫుడ్స్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, మహిళా సహకార ఆర్ధిక సంస్ధ, సివిల్ సప్లైయిస్ కార్పోరేషన్, హౌసింగ్ కార్పోరేషన్, మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషనన్, వికలాంగుల సంస్ధ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపి, ఏపి ట్రాన్స్‌కో, ఏపి జెన్కో, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఫిల్మ్, టివి, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఉన్నాయి. ఇవన్నీ 9వ షెడ్యూల్‌లో ఉన్నాయి. వీటి ఆస్తుల విలువను మదింపు చేసి, ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు పంపకాలు చేయాల్సి ఉంది.