తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: జర్నలిజం కోర్సును అభ్యసించే జర్నలిస్టుల సౌకర్యార్ధం 25 శాతం ఫీజు రాయితీని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి భరిస్తుందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మంగళవారం నాడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి, తెలుగు వర్శిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమి చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే తెలుగు వర్శిటీతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని జర్నలిజం చదివే అభ్యర్ధులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకూ దరఖాస్తులను ప్రెస్ అకాడమి కార్యాలయంలో సమర్పించాలని అన్నారు. గ్రామీణ విలేకరులు సైతం జర్నలిజంలో నాణ్యమైన సేవలు అందించడానికి ప్రెస్ అకాడమి తోడ్పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ భాష పత్రికల్లో క్రమక్రమంగా వాడుకలోకి వస్తోందని , ఇది పాఠకులు కూడా గ్రహిస్తున్నారని అన్నారు. మైసూర్‌లో ఉన్న తెలుగు అధికార భాషా కేంద్రాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు తగిన చర్యలను తీసుకుంటున్నట్టు తెలిపారు. తెలుగు యూనివర్శిటీ, ప్రెస్ అకాడమి సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలను చేస్తామని , ఫోటోగ్రాఫర్లకు, గ్రామీణ విలేకరులకు శిక్షణ ఇప్పించడానికి కార్యక్రమాలను రూపొందించినట్టు వివరించారు. ఈ సందర్భంగా వర్శిటీ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు మెరుగైన శిక్షణకు తాము అన్ని వేళలా సహకారం అందిస్తామని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం లక్ష పదాలతో భాషా నిఘంటువును రూపొందిస్తోందని అన్నారు. ఈ అవగాహనా ఒప్పందంపై ప్రెస్ అకాడమి కార్యదర్శి బి రాజవౌళి, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వి సత్తిరెడ్డిలు సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దూరవిద్యా కేంద్రం సంచాలకుడు సేతూరామ్, జర్నలిజం శాఖాధిపతి సుధీర్‌కుమార్, జి లక్ష్మణ్ కుమార్, ఎంకె రహ్మన్ తదితరులు పాల్గొన్నారు.