తెలంగాణ

శాస్ర్తియంగా పన్నుల వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది సమయంలోనే రాష్ట్ర ఆర్థికపరిస్థితి చక్కబడిందని, శాస్ర్తియంగా పన్నులు వసూలు చేస్తుండటమే ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలపై చర్చించేందుకు బుధవారం ఇక్కడ వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం నడిపిన పార్టీ చక్కగా పరిపాలన సాగిస్తోందన్న భావన దేశవ్యాప్తంగా అందరిలో ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే బాధ్యత వాణిజ్యపన్నుల శాఖపైనే ప్రధానంగా ఉందన్నారు. ఆర్థిక శాఖ కేవలం నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళికలను మాత్రమే రూపొందిస్తుందన్నారు. ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే శాఖలకు సమర్థులైన అధికారులను ముఖ్యమంత్రి నియమించారని, వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్, కమిషనర్ అనిల్‌కుమార్ చక్కగా, సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. బలవంతంగా పన్నులు వసూలు చేయాల్సిన పరిస్థితి లేదని ఈటల తెలిపారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్నులు చెల్లించక తప్పదన్నారు. దాంతో పన్నులు చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వివరించారు.
తెలంగాణ ఉద్యమానికి కారణమైన మూడు అంశాలను మంత్రి ఈటల గుర్తు చేస్తూ, నిధుల విషయంలో పురోగతి సాధించామని, నీళ్ల విషయంలో ముందడుగు వేస్తున్నామని, ఉపాధికల్పనలో వృద్ధిసాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్, కమిషనర్ అనిల్‌కుమార్, అడిషనల్ కమిషనర్లు రేవతిరోహిణి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టిఎస్‌ఐపార్డ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొంటూ, అభివృద్ధి, సంక్షేమంలో తమ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వివిధ పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని ఈటల గుర్తు చేశారు.

బుధవారం హైదరాబాద్‌లో వాణిజ్యపన్నుల శాఖ నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ప్రసంగిస్తున్న ఈటల