తెలంగాణ

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో అంగన్‌వాడీ గుడ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్వ, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, చిన్నారులకు కోట్లాది రూపాయలు వెచ్చించి పౌష్టికాహారం అందిస్తుంటే ఆ పౌష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పక్కదారి పడుతోంది. బుధవారం వనపర్తి జిల్లా మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద నరసింహ్మ అనే వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్‌లో అంగన్‌వాడీ గుడ్లు ఉండడంపై ఆ గుడ్లను చూసిన ప్రజలు అవాక్కయ్యారు. అంగన్‌వాడీ గుడ్లకు ప్రత్యేకంగా రంగు వేయడంతో ఆ గుడ్లను ప్రజలు గుర్తుపట్టే విధంగా ఉంటాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో అంగన్‌వాడీ గుడ్లను ఎలా విక్రయిస్తున్నారని పలువురు అడుగగా అవి అంగన్‌వాడీ కేంద్రం నుండి వచ్చాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ విషయంపై అంగన్‌వాడీ కేంద్రం టీచర్ మంజులను వివరణ కోరగా అంగన్‌వాడీ కేంద్రంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ సంబంధీకుల పిల్లలు ఉన్నారని, వారికి 16 గుడ్లు మాత్రమే ఇచ్చామని, వాటిని ఎక్కడ విక్రయిస్తున్నా తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఏదేమైనా పిల్లలకిచ్చే పౌష్టికాహారం అంగట్లో కనిపించడం పట్ల ప్రజలు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.