తెలంగాణ

‘గిరిజన సమస్యలపై క్షేత్ర స్థాయి పోరాటం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గిరిజనులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో గిరిజన నేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం టిపిసిసి నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖరులతోమాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన భూములను లాక్కుని హరితహారం పేరుతో మొక్కలు నాటుతోందని అన్నారు. గిరిజనులకు ప్రభుత్వ పరంగా కల్పించిన చట్టాలు ఎలా అమలువుతున్నాయో ప్రతి ఏటా రాష్టప్రతికి నివేదికలు ఇవ్వాల్సిన గవర్నర్ అవేమీ పట్టించుకోవడం లేదని తెలిపారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను సాధించేందుకు క్షేత్ర స్థాయి పోరాటాన్ని ఖరారు చేస్తామని తెలిపారు.