తెలంగాణ

39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: తెలుగు సాహిత్యంలోని భిన్న ప్రక్రియల్లోనూ, నాట్యం, నాటకం, అవధానం, పత్రికారచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలితసంగీతం, జ్యోతిషం, కార్టూన్ , గజల్ తదితర రంగాల్లో విశేషమైన సేవలు అందించిన 39 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాయలయ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది. పురస్కారాలకు ఎంపికైన వారిలో దేవులపల్లి కృష్ణమూర్తి(సృజనాత్మక సాహిత్యం), సయ్యద్ నసీర్ అహ్మద్ (పరిశోధన), పులిగడ్డ విశ్వనాధరావు(హాస్య రచన), హైమావతీ భీమన్న (జీవిత చరిత్ర), జ్వలిత (రచయిత్రి), హెచ్ కె వందన (నటి), సత్కళాభారితి నారయణ (నటుడు), అత్తలూరి విజయలక్ష్మి (నాటక రచయిత), భూపతి నారాయణ మూర్తి(హేతువాద ప్రచారం), తంగెళ్ల శ్రీదేవి(రచయిత్రి), దాసరాజు రామారావు(వచనకవిత), నోముల సత్యనారాయణ (ప్రక్రియలు), తెలకపల్లి రవి (పత్రికా రచన)ని ఎంపిక చేశారు. వీరితో పాటు చెంచు సుబ్బయ్య (అవధానం), సుమిత్ర (అభ్యుదయం), ఆచార్య రామారెడ్డి (గ్రంథాలయ కర్త), ఆచార్య చంద్రశేఖరరావు(సమాచార విజ్ఞానం) , విహారి (కథ), గంగోత్రి సాయి (నాటకరంగం), డా. సజ్జాద్ (సంఘసేవ), వి రమణి ( ఆంధ్రనాట్యం), జాతశ్రీ (నవల), ఆచార్య బి రామకృష్ణారెడ్డి (సాహిత్య విమర్శ), శింగారపు ఓదెయ్య (జానపద కళలు), బూర్గుల శ్రీనాధ శర్మ (ఆధ్యాత్మికం), పల్లేరు వీరస్వామి(విమర్శ), వెలుదండ సత్యనారాయణ (పద్యం), పద్మమోహన్ యాదగిరి (సాంస్కృతిక సంస్థ), పి వి అరుణాచలం (జనరంజక విజ్ఞానం) , సి నాగేశ్వరరావు (జానపదం), వి ఆర్ శర్మ (బాలసాహిత్యం), విశ్వనాథ్ జోషి (ఇంద్రజాలం), జి యాదగిరి (పద్యరచన), పాప (కార్టూనిస్టు), ఎ శారదారెడ్డి (లలిత సంగీతం), రేవతి రత్నస్వామి(సంగీతం), ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం (జ్యోతిషం), దాశరధుల బాలయ్య (గజల్), నిడమర్తి నిర్మలాదేవి (కాల్పనిక సాహిత్యం)లను ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 30, 31 తేదీల్లో వర్శిటీ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. పురస్కారం కింద 5116 రూపాయిల నగదు, పురస్కార పత్రం అందిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య వి సత్తిరెడ్డి చెప్పారు.