తెలంగాణ

సాగు విద్యుత్‌కు రూ. 4470 కోట్ల సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంపై భారీయెత్తున విద్యుత్ సబ్సిడీని భరించాలని నిర్ణయించింది. శనివారం ఇంధన శాఖ పద్దును మంత్రి ప్రవేశపెట్టారు. వ్యవసాయ సంబంధిత సబ్సిడీ నిమిత్తం రూ. 4470.10 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 20.74 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్ సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 20 ఎంయు విద్యుత్‌ను రూ.7.076 కోట్లను వెచ్చించి కేంద్ర విద్యుత్ సంస్ధల నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. గత ఏడాది మే నుంచి ఈ ఏడాది మే వరకు 3445 మెగావాట్ల విద్యుత్‌ను స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ ఎక్స్ఛేంజీ ద్వారా గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 5వరకు విద్యుత్ కొనుగోలుకు 133.527 కోట్లు కేటాయించామన్నారు.