తెలంగాణ

అబద్ధాలు, కాకిలెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి శనివారం గవర్నర్ చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని, అన్నీ అబద్ధాలే చెప్పారని బిజెపి ఆరోపించింది. శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం చెప్పినవి ఏమీ చేయకున్నా అన్నీ చేసినట్టు గవర్నర్ చెప్పడం విడ్డూరమని అన్నారు. గవర్నర్ ప్రసంగం పేజీలు పెరిగి, ప్రసంగ సమయం పెరిగిందే తప్ప ప్రయోజనం కనిపించలేదని అన్నారు. 2014లో 11 పేజీలు, 2015లో 16 పేజీలు, 2016లో 22, 2017లో 29 పేజీల ప్రసంగం చేశారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 36 నెలలు కావస్తున్నా ఎలాంటి హామీలను అమలు చేయలేదని అన్నారు. అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే గవర్నర్ తీసుకుని ప్రసంగం చేశారని, జరగని విషయాలను కూడా గొప్పగా చెప్పారని అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని గవర్నర్ తన గత ప్రసంగంలో చెప్పినా, ఆ సంగతి ఏమైందో నేటి ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదని అన్నారు. ఆ హామీ ఏమైందో కూడా గవర్నర్ ప్రశ్నించలేదని అలాగే విద్యుత్‌పై ఏదో ఘనకార్యం చేసినట్టు కాకిలెక్కలు చెప్పారని పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలు జరపుకుంటున్న ఉస్మానియా వర్శిటీలో అగచాట్లపై కూడా ఏం మాట్లాడలేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం మేడిపండులా ఉందని, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఒక్క రోజే చర్చకు పెట్టారని ఇది దారుణమని అన్నారు. బిఎసిలో కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఏం చెప్పినా టిఆర్‌ఎస్ నేతలు మాత్రం ఎంఐఎం వైపు చూస్తున్నారని, ఎంఐఎం కనుసైగల్లో ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా కేంద్రాన్ని తొలగిస్తామని చెప్పడం నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు. రాష్ట్రప్రభుత్వం నియంతృత్వపోకడలకు పోతోందని, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సరికాదని అన్నారు.
శాసనమండలి బిఎసిలో..
ఇలాఉండగా శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. మంత్రి హరీశ్ రావు అజెండా గురించి తెలిపారు. 13న బడ్జెట్ ప్రతిపాదన ఉంటుందని, 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించుకుందామని చెప్పారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మండలికి సెలవులు. 24, 25 తేదీల్లో బడ్జెట్, పద్దులపై చర్చ ఉంటుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలుపుతుంది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనమండలి సమావేశాలకు హాజరు కావాలని కోరారు. పెద్దల సభ అయిన శాసనమండలికి గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు. శాసనమండలికి వివిధ కమిటీలను నియమించలేదని అన్నారు.