తెలంగాణ

సంక్షేమానికి చోటేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ముఖ్యాంశాలను ప్రస్తావించలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రాధాన్యాంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చకపోవటం తెలంగాణ ప్రజానీకానికి విస్మయం కల్గించిందన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర వెబ్‌సైట్లు వెల్లడిస్తున్నాయని వివరించారు. రబీలో పంటలు విస్తారంగా పండినట్టు ప్రసంగంలో పేర్కొనటం సరికాదన్నారు. పంటలు పండింది తక్కువేనని, పండిన దానికి కూడా గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నా, గవర్నర్ ప్రసంగంలో 12 శాతం రిజర్వేషన్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రస్తావన, దళితులకు మూడెకరాల భూమి వంటి ముఖ్యమైన అంశాలను ఎందుకు ప్రస్తావించ లేదని ప్రశ్నించారు. రాజకీయ అవినీతి లేదని ప్రకటించడం హాస్యాస్పదమని, భారతదేశంలో అత్యంత అవినీతి తెలంగాణ ప్రభుత్వంలోనే ఉందని ఆరోపించారు. ప్రజలు తమ ఆకాంక్షలను, ఆవేదనలను, సమస్యలను విన్నవించుకునేందుకు వేదికగా భావిస్తున్న ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలని చూడటం సరికాదన్నారు. కాంగ్రెస్ శాసన సభ పక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ఏ ఒక్క అంశం కూడా గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం వల్లే తాము సభ నుంచి వాకౌట్ చేశామని వివరించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్‌రూమ్, మూడెకరాల భూ పంపిణీ, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వంటి అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేకపోవటం విచారకరమన్నారు. ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన పలు సంక్షేమ అంశాలకు గవర్నర్ ప్రసంగంలో స్థానం కల్పించకపోవటం వల్లే తాము వాకౌట్ చేశామని వివరించారు.

చిత్రం..మీడియా పాయంట్ వద్ద విలేఖరులతో మాట్లాడున్న కాంగ్రెస్ సభ్యులు