తెలంగాణ

కీళ్ల మార్పిడికి లండన్ డాక్టర్‌తో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 11: దేశంలో ప్రజలు అత్యధికంగా కీళ్ల నొప్పులబారిన పడి బాధపడుతుండటంతో ఉత్తమమైన కీళ్ల మార్పిడి చికిత్సను చేసేందుకుగాను లండన్‌కు చెందిన డాక్టర్ ఫిలిప్‌హార్ట్స్ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎస్‌విఎస్ మెడికల్ కళాశాల, ఆసుపత్రితో ఒప్పందం కూదుర్చుకున్నారు.
శనివారం ఈమేరకు లండన్ డాక్టర్ ఫిలిప్‌హార్ట్స్‌తో ఎస్‌విఎస్ ఆసుపత్రి ఎండి డాక్టర్ కెజె రెడ్డి ఒప్పందం పత్రాలను ఒకరికొకరు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌విఎస్ ఎండి డాక్టర్ కెజె రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కీళ్ల మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. లండన్‌కు చెందిన డాక్టర్ ఫిలిప్‌హార్ట్స్‌తో కీళ్ల మార్పిడి కోసం ఒప్పందం కూదుర్చుకున్నామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ప్రస్తుత జీవనశైలి మార్పులతో ఆహార అలవాట్లు, యాంత్రిక జీవనంతో మోకాళ్ల నొప్పులు సాధారణంగా మధ్య వయస్సు, వృద్ధులలో అధికంగా కనబడే ఈ బాధ నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు ఫిలిప్‌హార్ట్ ఇక్కడ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. అదేవిధంగా కీళ్ల మార్పిడి శస్తచ్రికిత్సలోని మెలకువలను ఇక్కడి ఆర్థోసర్జన్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఏడాదికి రెండు సార్లు మహబూబ్‌నగర్ ఎస్‌విఎస్ ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు శిక్షణ ద్వారా యువ వైద్యుల్లో నైపుణ్యత పెంపొదించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారతదేశంలోనే తొలిసారిగా కీళ్ల మార్పిడి కోసం ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమమని, దేశంలో ఎక్కడా ఇలాం టి ఒప్పందం ఏ ఆసుపత్రిలోనూ లేదన్నారు. తనకు లండన్‌లో ఫిలిప్ హార్ట్స్‌తో సంబంధాల కారణంగా వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీళ్ల మార్పిడి శస్తచ్రికిత్సను అందించాలని కోరడంతో ఆయన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని కెజె రెడ్డి తెలిపారు.
ఈ వైద్యం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విఎస్ డైరెక్టర్ రాంరెడ్డి. సిఇఓ చంద్రశేఖర్, సెక్రెటరీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.