తెలంగాణ

రాష్ట్రం అప్పుల కుప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ వార్షికంలో గణనీయంగా పెరుగుతూ వచ్చిన ఆదాయవృద్ధి, నోట్ల రద్దు తర్వాత తగ్గుముఖం పట్టినప్పటికీ గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 12 శాతం వృద్ధి చెందింది. అయి తే ప్రభుత్వం ఆశించిన మేరకు ఆదాయవృద్ధిలో పెరుగుదల లేకపోయినప్పటికీ అర్ధవార్షికంలో 21 శాతం పెరగడంతో నోట్ల రద్దు తర్వాత తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేయగలిగింది. ఆదాయవృద్ధికి ఢోకా లేకపోయినప్పటికీ రాష్ట్రంపై అప్పుల భారం ఈ మూడేళ్లలోనే రెట్టింపు కావడం ఆందోళన కలిగించే అంశం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి (2014, జూన్ 2) ఉమ్మడి రాష్ట్రంపై ఉన్న అప్పు రూ. 1.48 లక్షల కోట్లు కాగా జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి రూ.61,710 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.86.34 కోట్ల అప్పును పంచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి రూ.61,710 కోట్లు ఉన్న అప్పు ఈ మూడు సంవత్సరాలలోనే దాదాపు రెట్టింపు అయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వడ్డీలు కలుపుకుని రూ.లక్ష 20 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్రంపై ఏటా రమారమి 20 వేల కోట్ల రూపాయల చొప్పున ఈ మూడేళ్లలో చేసిన అప్పు దాదాపు రూ.60 వేల కోట్లకు చేరుకుంది.
దీంతో రాష్ట్రంపై ప్రస్తుతం ఉన్న అప్పు భారం సుమారు రూ. లక్ష 20 వేల కోట్లు. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్‌లో చేరడంతో ట్రాన్స్‌కో, జెన్‌కోలపై ఉన్న అప్పు రూ.8,923 కోట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అప్పుకు అదనంగా ఇది కూడా వచ్చి చేరింది. రాష్ట్రం చేసిన అప్పు జిడిపిలో 16.06 శాతానికి చేరుకుంది. రాష్ట్ర ఆదాయవృద్ధి గణనీయంగా పెరుగుతూ వస్తున్నప్పటికీ అంతకుమించి అప్పుల భారం రాష్ట్రం పై కుంపటిలా మారింది. తెలంగాణ ప్రభుత్వం మొదటి ఏడాది రూ. 10 వేల కోట్లు, రెండవ ఏడాది రూ.16 వేల కోట్లు, ఈ ఏడాది రూ.21వేల కోట్లు, తాజాగా ట్రాన్స్‌కో, జెన్‌కోలపై ఉన్న అప్పు సుమారు రూ. 9 వేల కోట్లతో ఇది లక్ష 20 వేల కోట్లకు చేరుకుంది. ఇలా ఉండగా మిషన్ భగీరథ పథకానికి రూ. 25 వేల కోట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ.17 వేల కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.7400 కోట్లు కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అప్పు తీసుకోవడానికి ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేసిం ది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయబోయే అప్పు ప్రస్తుతం ఉన్న అప్పునకు అదనంగా మరో రూ.15 వేల కోట్లు ఉండవచ్చని అంచనా. అలా అయితే రాష్ట్ర ప్రభుత్వం 2016-17లో ప్రవేశ పెట్టిన మొత్తం బడ్జెట్ రూ. లక్ష 30 వేల కోట్లు కాగా దానికి సమాన మొత్తంలో అప్పుల భారాన్ని రాష్ట్రం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.