తెలంగాణ

అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యక్తిగత మొక్కుల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై సమగ్ర వివరాలను అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం సామాజిక వేత్తలు డాక్టర్ కంచె ఐలయ్య, జి.రాములు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ తిరుమల వెంకటేశ్వరునికి, వరంగల్ భద్రకాళి, విజయవాడ కనకదుర్గమ్మ, కురవి వీరభద్రస్వామికి మొక్కులు చెల్లిచేందుకు కామన్ గుడ్ ఫండ్ ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. ఇలా కామన్‌గుడ్ ఫండ్ వినియోగించడం రాజ్యాంగ విరుద్ధం, లౌకిక సిద్ధాంతానికి విరుద్దమని వాదించారు. ఈ ఫండ్ నుంచి అర్చకుల జీతాలు, నిత్య దీపారాధన వంటి వాటికి వినియోగించుకోవాలి తప్ప ఇతర ప్రయోజనాలకు వినియోగించరాదని స్పష్టంగా ఉన్నా వినియోగించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఈ కేసును నాలుగు వారాలు పాటు వాయిదా వేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ఆర్థిక సంఘం ఎందుకు నియమించడం లేదు
రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎందుకు నియమించడం లేదో వివరణ ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, మరో స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎందుకు ఆర్థిక సంఘాన్ని నియమించలేదో స్పష్టం చేయాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నియమించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-1ని ఉల్లంఘించడమేనని, ఇది పూర్తిగా అన్యాయమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సంఘం ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పంచేందుకు దోహదపడుతుందని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.