తెలంగాణ

కృష్ణాపై కర్ణాటక ఎత్తిపోతల ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ఎగువ కృష్ణా ఆధునీకరణ పేరిట కర్నాటక ప్రభుత్వం నాలుగు ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మించాలన్న ఆలోచనపై ప్రతిపక్షాలు ఆందోళన బాట చేపట్టనున్నాయి. ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దీనిపై బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. నాలుగు ప్రాజెక్టులకు అవసరమైన అనుమతి పత్రాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వాస్తవమా? కాదా? అని కూడా నిలదీయనున్నది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, డికె అరుణ, సంపత్ కుమార్ అడిగిన ప్రశ్నపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు అసెంబ్లీలో సమాధానం చెప్పనున్నారు. ఇది చాలా ప్రధాన అంశమని, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంది కాబట్టి కర్నాటక ప్రభుత్వం ఆలోచనను విరమింపజేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పట్టుబట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు, కర్నాటక ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం పోరాడేందుకు ఒత్తిడి పెంచేలా కలిసి పోరాటం చేద్దామని కాంగ్రెస్ మిగతా పక్షాలకు విజ్ఞప్తి చేసింది.