తెలంగాణ

ప్రభుత్వానిది కక్ష సాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: శాసనసభలో తమ సభ్యుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని తమ సభ్యులు రేవంత్‌రెడ్డి, వీరయ్యలను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ సభ్యులు కూడా నినాదాలు చేశారని, కాంగ్రెస్ వాకౌట్ చేసిందని గుర్తు చేశారు. టిడిపి సభ్యులు ఎలాంటి నినాదాలు చేయకపోయినా సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ప్రభుత్వానికి గిట్టని వారు సభలో ఉండకూడదని ప్రభుత్వం భావిస్తుందా..? అని ప్రశ్నించారు.
ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2009-14లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా అప్పుడు టిఆర్‌ఎస్ సభ్యులు ఏ రకంగా ప్రవర్తించారో చూశామని, ఆ సిడిలను వేసుకుని గతంలో జరిగిందేమిటో గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో కూర్చుని ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం గవర్నర్ ప్రసంగానికి, స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొన్నారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నేతలు రావుల, పెద్దిరెడ్డి తదితరులు