తెలంగాణ

నేడు టిడిపి సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారన్న కారణంతో అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్‌ను ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ఎస్. మధుసూదనాచారి రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 10న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య రన్నింగ్ కామెంట్ చేస్తూ, గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారన్న కారణంతో ఆ మర్నాడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్ రావు వారిరువురిని సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రతిపాదించడం, దానిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించిన సంగతి తెలిసిందే. తమ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్యలతో అసెంబ్లీలో సభ్యుల హక్కులను కాలరాసినట్లు అవుతుంది కాబట్టి ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని విపక్షాలు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం వినిపించుకోలేదు. అసెంబ్లీలో భయం ఉండాలని, చట్టసభ అంటే గౌరవం ఉండాలన్న భావనతో సస్పెండ్ చేయడమే జరిగింది తప్ప వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని పాలక పక్ష సభ్యులు చెబుతున్నారు.
తమను సస్పెండ్ చేయడంతో రేవంత్, సండ్ర రాజకీయంగానే కాకుండా, న్యాయపరంగా పోరాటానికి దిగారు. గవర్నర్ ప్రసంగం సభ పరిధిలోకి రాదని, గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాతే సమావేశాలు స్పీకర్ పరిథిలోకి వస్తాయని రేవంత్ రెడ్డి మంగళవారం హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగే ఘటనలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమని, చర్య తీసుకునేందుకు అసెంబ్లీలో రూల్స్ కూడా లేవని తెలిపారు. కాబట్టి తమ సస్పెన్షన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించి ఆ ఉత్తర్వులను కొట్టి వేయాలని హైకోర్టును కోరారు.
ఇలాఉండగా బుధవారం (15న) సభలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభంకానున్నది. రేవంత్, సండ్ర సస్పెన్షన్‌ను ఉపసంహరించి, వారిరువురూ బడ్జెట్‌పై చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపక్షాలన్నీ స్పీకర్‌ను, ప్రభుత్వాన్ని కోరనున్నాయి. ఇంత కంటే ఎక్కువ రోజులు చర్య తీసుకోవడం భావ్యంగా ఉండదని కోరనున్నారు. విపక్షాల వినతి మేరకు ప్రభుత్వం వారి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

చిత్రం..జానారెడ్డి