తెలంగాణ

హక్కులను కాలరాస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వం శాసన సభ్యుల హక్కులను కాలరాస్తున్నదని, ప్రశ్నించే వారందరిపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు గుప్పిస్తున్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం నగరంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం సమర్పించిన అనంతరం టిడిఎల్‌పి ఉపనేత సండ్ర వెంకటవీరయ్యతో కలసి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం సమయంలో తమను సస్పెండ్ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. గవర్నర్ ప్రసంగం వీడియో పరిశీలిస్తే అన్ని తెలుస్తాయని అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామనే భయంతోనే తమను సస్పెండ్ చేశారన్నారు. గతంలో గవర్నర్‌పై పేపర్లు చింపివేసిన హరీష్‌రావు కూడా ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎద్దవా చేశారు. తెలుగుదేశం పార్టీని ప్రజల నుండి దూరం చేయటం సాధ్యం కాదన్నారు.
కార్యకర్తల పార్టీ అయిన తెలుగుదేశం ప్రజల గుండెల్లో ఉందని, నాడు టిడిపి రాజకీయ బిక్ష పెడితే దానినే విమర్శించే పరిస్థితి రావటం దురదృష్టకరమన్నారు. కెసిఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యమంత్రి మోసాలను ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని, దీనిని అడ్డుకునేందుకు ప్రజలు సిద్దమవుతున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని భావించి మాయమాటలతో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తెలంగాణ ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని, త్వరలోనే టిఆర్‌ఎస్ నేతలకు అది అనుభవంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటనకు ప్రజల నుండి అనూహ్య స్పందన రావటం విశేషం.

చిత్రం..ఖమ్మంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం సమర్పించిన అనంతరం
మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర