తెలంగాణ

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ కలెక్టర్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), మార్చి 14: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు సంబంధించిన భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజు, స్పెషల్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లుపై న్యాయమూర్తి సతీష్ కుమార్ ఆదేశానుసారం ఎల్‌ఎండి పోలీసులు క్రైం.నం.79/2017 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు అభివృద్ధికోసం భూసేకరణ చేపట్టగా సిరిసిల్ల రాజన్న జిల్లాలోని చీర్లవంచ గ్రామం ముంపునకు గురైం ది. బోనాల నర్సమ్మ-రాజయ్యలకు సంబంధించిన నివాస గృహం లో తమకు వాటా రావాలని మంగళారపు భారతమ్మ, చదువాల లచ్చవ్వ సోదరులు మల్లయ్య, లచ్చయ్యపై సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా దాఖలు చేశారు. కోర్టు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తరువాత 1/4వ వంతు వాటా నలుగురికి ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి తీర్పు వెలువరించేవరకు కోర్టు కేసు పెండింగ్‌లో ఉంచింది. అయతే, పూర్తిస్థాయి తీర్పు వెలువడకముందే స్పెషల్ డి ప్యూటీ కలెక్టర్ ఎన్.నటరాజు (్భసేకరణ విభాగం) తిమ్మాపూర్ మల్లయ్య, లచ్చయ్యతో కుమ్మక్కై వారికి సహకరిస్తూ వచ్చిన నష్టపరిహారాన్ని వారిరువురికి 2015 లో అందజేశాడు. విషయాన్ని తెలుసుకున్న బాధితులు భారతమ్మ, లచ్చవ్వ పలుమార్లు అధికారులతో మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లభించకపోవడంతో లీగల్ నోటీసులు పంపించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే నష్టపరిహారం కింద వచ్చిన మొత్తం సొమ్మును వారి సోదరులకు మాత్రమే ఎలా ఇచ్చారని, ఆగస్టు 2016లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజును నిలదీశారు. ఆగ్రహంతో బాధితులను తిడుతూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి ద్వారా పిటీషన్లు పెట్టుకున్నప్పటికీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమ న్యాయవాది జె.వేణుగోపాల రావు ద్వారా న్యాయస్థానంలో బోనాల మల్లయ్య, లచ్చయ్యలతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజు, స్పెషల్ కలెక్టర్ భూసేకరణ విభాగం ఎస్.వెంకటేశ్వర్లుపై సెక్షన్ 166ఎ, 217, 218, 221, 120బి, 420 ఐపిసి కింద కేసు నమోదు చేయాలని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయా ఫిర్యాదును స్వీకరించిన న్యాయమూర్తి సతీష్ కుమార్ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బోనాల మల్లయ్య, లచ్చయ్యతో పాటు భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజు, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్‌కు సూచించారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఎల్‌ఎండి పోలీస్ అధికారులు పై నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.