తెలంగాణ

ముధోల్‌లో వడగళ్ల వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్,మార్చి15: వడగండ్ల వర్షం బుధవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలో బీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన కురవడంతో చెట్లు నేలకొరిగాయి. దాదాపు గంటపాటు బలమైన గాలులతో వడగండ్ల వాన భీబత్సం సృష్టించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న భారీ షెడ్లు తెగి రోడ్డుపైనే పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హోటళ్లు, దుకాణాల పై ఉన్న రేకులు బలమైన గాలులకు ఎగిరిపోయాయి. సామాన్లు చిందరవందరగా మారడంతో దుకాణ యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్య రబీ పంటలైన జొన్న, మొక్కజొన్న అక్కడక్కడ వేసిన కూరగాయాల పంటలు సైతం వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటసైతం నేలకొరిగి రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన గాలులకు విద్యుత్‌స్థంభాలు సైతం వంగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
దీంతో స్తానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈదురుగాలులకు మామిడి పంట రైతులకు తీవ్ర నష్టామిన్ని తెచ్చిపెట్టింది. ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్రమైన ఎండగా ఉండి ఒకేసారి వాతావరణం చల్లబడి తీవ్ర వర్షం కురవడంతో రైతులు కళ్లాల వద్ద ఉన్న వివిధ పంటలు నీటిలో తడిసి ముద్దయ్యాయి. రైతులు రక్షించే ప్రయత్నం చేయగా ఫలితంలేకుండా పోయింది.