తెలంగాణ

మతసామరస్యం వెల్లివిరిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 15: రామమందిర నిర్మాణానికి ముస్లింలు ముందుకొచ్చి పనుల్లో భాగం పంచుకుని, చేయూతనందించారు. దీంతో ప్రతి గ్రామానికి ఈ గ్రామం ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రానికి 15కిలోమీటర్ల దూరంలో నీలాద్రి అటవీప్రాంతంలో గల ఈ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నా యి. ఇందులో 80 కుటుంబాలకు పైగా ముస్లింలవే కావటం విశేషం. అయినప్పటికీ ఈ గ్రామం పేరు రామచంద్రాపురం కావటం ఇక్కడ అన్ని కులాలు మతాలు కలిసి మెలిసి సోదరుల్లా జీవిస్తుంటారు. అన్ని పండుగలు అందరూ కలిసే ఆనందంగా జరుపుకుంటారు. హిందూ పండుగలకు ముస్లింలను, ముస్లిం ల పండుగలకు హిందువులను ఆహ్వానిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నా రు. ఈ ఊరిపేరులో రాముడున్నా ఊరిలో రామమందిరం లేదు. అధికంగా ఉన్న ముస్లింలే ముందుగా రాముడిగుడి నిర్మాణానికి ముం దుకొచ్చారు. వీరే దగ్గరుండి శాస్త్రోత్తంగా శంకుస్థాపన చేసి, సాంప్రదాయబద్ధంగా పనులు సాగించారు. మందిర నిర్మాణానికి ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాలుగా సహకరించారు. ప్రస్తుతం ఈ గ్రామంలో రామనామం మార్మోగుతోంది. రెండు రోజులుగా పూజలు, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి.
గురువారం రామచంద్రాపురంలోని రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరగనున్నాయి.
ముస్లింలే ముందుండి ఏర్పాట్లు చేస్తుండటం అందరికి ఆదర్శంగా మారింది. ప్రతి గ్రామం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే దేశమంతా మత సామరస్యం వెల్లువిరుస్తుంది.

చిత్రం... ముస్లింల భాగస్వామ్యంతో నిర్మించిన రామాలయం