తెలంగాణ

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్/ హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.గురువారం శాసన మండలిలో అధికార పార్టీ సభ్యులు రాములు నాయక్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
చట్టాలు ఉల్లంఘించి బాల బాలికలను పనిలో పెట్టుకుంటే పీడీయాక్ట్‌ను ప్రయోగించడానికైనా ప్రభుత్వం వెనుకాడదన్నారు.
అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ఆహార భద్రత కార్డు ఉన్న అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డి మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 70వేల ఇళ్లకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలిపారు.
కర్ణాటక ప్రాజెక్టులతో నష్టమే: హరీష్‌రావు
కృష్ణానదీపై కర్నాటక ప్రభుత్వం నిర్మించే ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు ఎంతో నష్టం జరుగుతుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు సభ్యుల ప్రశ్నకు జవాబుగా చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నీటి పంపిణీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి జవాబిస్తూ బ్రిజేష్ కమిటీ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, నివేదిక బయటకు వచ్చినపుడే ప్రాజెక్టులపై నియంత్రణ ఉంటుందన్నారు. నిజాం సాగర్ కింద 2.10లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించామని, రాబోయే కాలంలో కూడా సాగునీరు అందిస్తామని ఉద్ఘాటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద సాగునీరు అందిస్తున్న ప్రభుత్వానికి మహమ్మద్ అలీ షబ్బీర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈత, తాటి వనాలకు నిధులు: పద్మారావు
రాష్ట్రంలో ఈత, తాటి వనాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని మంత్రి పద్మారావు తెలిపారు. కల్లుగీత కార్మికులకు ప్రమాదకర నష్టం కింద ఇస్తున్న నష్టపరిహారం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.