తెలంగాణ

తలో చేయి వేశారు..తలంబ్రాలు పడ్డాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, మార్చి 16: పేదింటి ఆడపిల్లకు గ్రామస్థులు, బంధువులు, ప్రజాప్రతినిధులంతా చేయూతనివ్వగా పోలీసులు ముందు నిలవడంతో పెండ్లి నిశ్చయం చేసి చేతిలో చిల్లి గవ్వలేక ఆత్మహత్యకు పాల్పడిన తిరుమలాపూర్ వాసి పాకాల హన్మాండ్లు కూతురు వివాహం గురువారం వరుడు గణేష్‌తో రామాలయంలో జరిగింది.
తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయినప్పటికీ పోలీసులు మానవత్వాన్ని చాటారు. అన్నీ తామై ఆడపిల్లకు అండగా నిలిచారు. దుఃఖంలో మునిగిపోయిన రమను తట్టిలేపి ధైర్యం నింపారు. పెళ్లి జరిపిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మండలంలోని వివిధ రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి చేతనైన సహాయం చేశారు. కరీంనగర్ ఎసిపి తిరుపతి పుస్తె, మట్టెలు అందించగా, స్థానిక జడ్పీటిసి వీర్ల కవిత-వెంకటేశ్వర్‌రావు దంపతులు భోజన ఖర్చులు సహాయం అందించారు. అనుకున్న సమయానికే రమ వివాహం చూడడానికి గ్రామస్థులంతా రామాలయానికి తరలివచ్చారు. పండితులు పెళ్లి మంత్రాలు చదివి వివాహ తంతు ముగించారు. పెండ్లి పెద్దగా సిపి కమలాసన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిపి విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ఈ పెండ్లి ప్రతిరూపంగా నిలిచిందన్నారు. రమ భర్తకు ఏదైనా ఉపాధి చూపించే ఆలోచన చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

చిత్రం..నూతన వధూవరులతో సిపి కమలాసన్ రెడ్డి తదితరులు