తెలంగాణ

బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/అల్వాల్, మార్చి 16: అల్వాల్‌లో అమానుషం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో ఓ ఇంటర్ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. సదరు బాలిక మైనర్ కావడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా పరిగణించి అల్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌రెడ్డి తెలిపారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. అల్వాల్‌లో వేర్వేరు ప్రాంతాల్లో నివాసముండే 17 సంవత్సరాల బాలిక, బాలుడు ఓ విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇద్దరు మైనర్లు పరస్పరం ప్రేమించుకున్నారు. హద్దులు దాటడంతో బాలిక గర్భం దాల్చింది. ఈ క్రమంలో బాలిక గత నెల 14న పురిటి నొప్పులతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. అక్కడ బాలిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సదరు బాలిక మైనర్ కావడంతో ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా పరిగణించి అల్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా పెద్దలు జోక్యం చేసుకుని ఈ విషయాన్ని గుట్టుగా దాచారు. పెళ్లికి బాలిక తరఫువారు పట్టుబట్టగా, ఇద్దరు మైనర్లు కావడంతో పెళ్లికి వయస్సు అడ్డు వచ్చింది. మైనార్టీ తీరిన తరువాత పెళ్లి చేయిస్తుమని పెద్దలు ఒప్పందం చేయించారు. చిన్నారిని ఓ శిశు సదనంలో చేర్పించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించకపోవడంతో పోలీసులూ పట్టించుకోలేదు. కాగా బాలుడు నగరంలోని ఓ కీలక ప్రజాప్రతినిధికి అనుచరుడు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజుల తరువాత బుధవారం బహిర్గతమైంది. మరోవైపు విషయం బయటికి చెప్పకుండా బాలిక కుటుంబాన్ని బాలుడి వర్గం బెదిరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేయని పోలీసుల తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. నెల రోజులుగా గుట్టుగా ఉన్న ఈ విషయం తాజాగా బహిర్గతం కావడంతో ఇన్నాళ్లు తాత్సారం చేసిన పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసినట్టు సిఐ ఆనందరెడ్డి తెలిపారు. ఇదిలావుండగా పెద్దల ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవడంతో బాలుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ వివరించారు.