తెలంగాణ

భూనిర్వాసితులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 16: సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి బడ్జెట్‌లో సబ్బండ వర్గాలకు మొండిచేయి చూపారని, అన్ని ఎర్రజెండాలతో అన్నివర్గాలను కలుపుకుని సిఎంపై దండయాత్ర సాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సామాజిక న్యాయం-సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూర్, పెద్దకందుకూర్, యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర సాగింది. ఈ యాత్రకు సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. పెద్దకందుకూర్ గ్రామంలో సిపిఎం పార్టీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంబించిన అనంతరం వీరభద్రం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజ మెత్తారు. దళితులకు మూడెకరాల భూమి ఇంతవరకు ఎక్కడా అమలు కాలేదని, తాను మొక్కుకున్న మొక్కులను రెండు సంవత్సరాలలో పూర్తి చేశారని, కానీ ప్రజల వాగ్దానాలను తీర్చలేక గారడీ వాగ్దానాలతో ప్రజలను తికమకపెడుతున్నారని ధ్వజమె త్తారు. యాదాద్రి అభివృద్ధి హర్షించేదే అయినా అభివృద్ధిలో తఎం అండగా ఉంటుందని ఆయన అన్నారు. పెద్దకందుకూర్ సభకు ప్రజాగాయకుడు గద్దర్ హాజరై సామాజిక తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, న్యాయాన్ని కాపాడుదాం.. అన్యాయాన్ని ఎదురిద్దాం అని ప్రతిఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. తనదైన శైలిలో పాటలతో, మాటలతో ప్రజలను ఆయన ఆకట్టుకున్నారు. పెద్దకందుకూర్ నుండి యాదగిరిగుట్టకు పాదయాత్రలోపాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాదయాత్రకు సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సిపిఎం జిల్లా అధ్యక్షుడు జంగీర్, సిఐటియు నాయకులు రమణ, మంగ నర్సింహ్మ, గిరందాసు గోపి, రమ, కాంగ్రెస్ నాయకులు సీస మనోహర్ పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో మహాజన పాదయాత్రకు జన నీరాజనం పలికారు. బస్‌స్టాండ్ సమాపంలో ఏర్పాటు చేసిన సభలో వీరభద్రం మాట్లాడుతూ తాను పాదయాత్ర చేయనున్నామని ప్రకటించగానే సిఎం కెసిఆర్ గ్రామాలలో తమను జనం తరిమికొడతారని, రాళ్ళవర్షం కురుస్తుందని హెచ్చరించినా తాను భయపడలేదని, ప్రజలు రాళ్ళవర్షం బదులు పూలవర్షం కురిపించారని అన్నారు.

చిత్రం..పాదయాత్రలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్