తెలంగాణ

బడ్జెట్‌లో మా బతుకు ఉంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ‘మీ పుణ్యమా అని దేశంలో, రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంది..’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. మీది పదవి ఆరాటం, మాది బతుకు పోరాటం అని ఆయన విమర్శించారు. బడ్జెట్‌పై మంత్రి ఈటల సమాధానమిస్తూ బడ్జెట్‌లో మా బతుకులు ఉన్నాయని వివిధ కుల వృత్తుల వారు ఎదురు చూశారని చెప్పారు. ఆ వర్గాలతో టిఆర్‌ఎస్ గత పదిహేను ఏళ్ళుగా పెనవేసుకున్నదని అన్నారు. మత్స్య, నాయి బ్రాహ్మణ, రజక వంటి కులాల గురించి ఎప్పుడూ ఏ ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొనలేదని ఆయన తెలిపారు. చేపల పెంపకం మాకు, పరిపాలన మీకా? అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయని అన్నారు. గొర్ల పెంపకం చిన్నతనమా? అని ఆయన ప్రశ్నించారు. కైకలూరు వెళితే చేపల పెంపకంతో లాభం ఎంతో తెలుస్తుందని అన్నారు. పందుల పెంపకం లాభదాయకమని అన్నారు. పౌల్ట్రీ రంగంలో డాక్టర్ బివి రావు ఎలా అభివృద్ధి చెందారో ఆయన వివరిస్తూ ఎవరినీ కించపరచవద్దని, ‘అనూస్’ ఎవరిదో తెలుసుకోవాలని ఆయన కోరారు. 500 కోట్లతో రజక, నాయి బ్రాహ్మణులకు పథకాలు ప్రారంభించామని ఆయన చెప్పారు. గొర్ల కాపర్లు, మత్స్య కార్మికులు, కల్లు గీత కార్మికులకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రారంభించామని, ఎస్‌సి, ఎస్‌టిలు లక్ష రుణం తీసుకుంటే 80 వేల సబ్సిడీ ఇస్తున్నామని ఆయన వివరించారు.
350 రకాల పథకాలను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి లోగడ ప్రాతినిధ్యం వహించినప్పుడు అభివృద్ధి చేసినట్లే తెలంగాణ మొత్తాన్ని అభివృద్ధి పరచాలన్న పట్టుదలతో ఉన్నారని ఆయన తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు వసతి గృహంలో ఉండి చదువుకున్నానని, అప్పుడు ఇక అన్నం పెట్టేవారని, ఇప్పుడు సన్న బియ్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
సిఎం సూత్రాలు..
కొత్త రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. నిరాశతో బతక వద్దని, సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదని ముఖ్యమంత్రి చెబుతుంటారని ఆయన తెలిపారు.