తెలంగాణ

వైభవంగా రాజేశ్వరుడి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ,మార్చి 17: శివకల్యాణోత్సవాలలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరక్షేత్రంలో శుక్రవారం రథోత్సవాన్ని అంగరంగవైభంగా నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని వేలాదిమంది భక్తులు తిలకించి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. ముందుగా స్వామివార్ల ఆలయ ప్రాంగ ణం నుంచి ఉత్సవమూర్తులను వేదమంత్రోచ్ఛారణలతో మంగళవాయిద్యాల మధ్య రథాలవద్దకు చేర్చారు. ఈలోగా రథానికి రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలిని వేదమంత్రోచ్ఛారణలతో స్థానాచార్యాలు గోపన్నగారి శంకరయ్య శాస్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తలను రథంలో అధిష్టింపజేశారు. ఆ హరిహరుల రథాలు కదలగానే వేలాది మంది భక్తులు ఓం నమఃశివాయ అంటూ నినదించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర్లు, శ్రీ అనంత పద్మనాభస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మహిళలు ఎదురేగి మంగళహరతులతో స్వాగతంపలికారు. వేణుగోపాల స్వామి ఆలయం దా టాక రహదారిపై స్థానాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరి గి ఆలయానికి రథాలు వెనుదిరిగాయి. భక్తులు ఆ ఆది దంపతుల రథోత్సవంలో పాల్గొని జయజయ మహాదేవ అంటూ నీరాజనాలర్పించారు. సిఐ శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు ఇవో రాజేశ్వర్, చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం,వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ,విహెచ్‌పి నాయకులు గడపకిషోర్‌రావు,కనికరపురాకేశ్, ఎర్ర శ్రావణ్ పాల్గొన్నారు.