తెలంగాణ

రూ.80వేల కోట్ల రుణాలపై శే్వతపత్రం ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన రూ.80వేల కోట్ల రుణాలపై శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2014 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ.61,710 కోట్లు ఉండగా, తాజా బడ్జెట్లో రూ. 1,40,052 కోట్లకు చేరుకుందన్నారు. ఈ అప్పులను ప్రజల వౌలిక అవసరాలైన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పథకం, మంచినీరు, జిహెచ్‌ఎంసి, ఆర్టీసి కోసమో వినియోగించలేదన్నారు. ఈ రుణాన్ని ఏ పథకాలకు ఖర్చుపెట్టారో వెల్లడించాలన్నారు. సమగ్రసర్వేలో 22 లక్షల మంది ఇండ్లు లేనివారున్నారని చెప్పారన్నారు. గ్రామానికి వచ్చే పది ఇండ్లు కూడా టిఆర్‌ఎస్ పార్టీ పైరవీ కారులకే వెళతాయన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోందన్నారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తున్నారని, ఆర్టికల్ 14,19 ప్రకారం ఇతరుల స్వేచ్ఛకు భంగం కలుగకుండా వాక్ స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.