తెలంగాణ

మండలి టీచర్స్ స్థానానికి నేడు మళ్లీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏర్పాటైన ఎనిమిది జిల్లాలను కలుపుతూ ఏర్పాటైన శాసన మండలి టీచర్స్ స్థానానికి నేడు మరోసారి పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికకు విస్త్రృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్థానానికి తొలుత ఈ నెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించగా, బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల ఫొటోలు తారుమారవడంతో జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరోసారి పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి తప్పులూ దొర్లకుండా చూసేందుకు బ్యాలెట్ పేపర్ ముద్రణకు ముందు, తర్వాత కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్, జిల్లా ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి నేరుగా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభంకానున్న ఈ పోలింగ్‌లో ఎనిమిది జిల్లాకు చెందిన 23,789 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇదివరకే ఓసారి పోలింగ్ జరగటంతో ఈసారి ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఎడమ చేతి మధ్య వేలుపై సిరా గుర్తువేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేగాక, ఇప్పటికే వేసవి ఎండలు ముదరడంతో ఓటర్ల కోసం పోలింగ్ బూత్‌ల సమీపంలో షామియానాలు వేసి వారు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22వ తేదీన అంబర్‌పేటలోని ఇండోర్ స్టేడియంలో ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పరిశీలకుడు రజత్‌కుమార్ శనివారం ఈ కేంద్రాన్ని సందర్శించారు.