తెలంగాణ

డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డు ప్రాజెక్టుగా సిరిసిల్ల రాజన్న జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 18: రాష్ట్రంలోనే తొలిసారిగా డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డు ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లాను చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌ను ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు ఆదేశించారు. శనివారం వేములవాడలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజల మొత్తం ఆరోగ్య సమాచారాన్ని పొందుపరచి, కార్డు, నెంబర్ ఒక్కొక్క పౌరునికి అందజేస్తాం, దీని ద్వారా అత్యసవర పరిస్థితిలో ఈ పౌరులకు సంబంధించిన డిజిటల్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే అతని ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుస్తుందని, దీని ద్వారా క్షణాల్లో మెరుగైన వైద్యసేవలను అందించడానికి, ప్రాణాలను నిలపడానికి విలువైన సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టును తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. చిన్న జిల్లా అయినా రాష్ట్రం లో ఆదర్శవంతంగా ఉంచడానికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో బహిరంగా మలమూత్రవిసర్జన రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లాను మొదటి స్థానంలో నిలిపామని మంత్రి గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును పూర్తి చేద్దామిని పిలుపునిచ్చారు.రాజన్న క్షేత్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నదని, భవిష్యత్తులో సిరిసిల్ల కంటే వేములవాడ ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలలో ఊహించనంత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ, సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అనువుగా ఉండే విధంగా జిల్లా కలెక్టరేట్‌ను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపి వినోద్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టాస్‌కాబ్ చైర్మన్ రవీందర్‌రావు తదితరులు పాల్గ్గొన్నారు.

చిత్రం..వేములవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో
మాట్లాడుతున్న ఐటి శాఖ మంత్రి కెటిఆర్